Saturday, 30 May 2015

మహర్షులు శాపాలు  ఇవ్వడం వలనే హిందువులకి ఇంత వాంగ్మయము అంటే రామాయణము, భాగవతం, మహా భారతం  లాంటి ఇతి హాసాలు వచినవి ద కదా . మనిషి ఎలా ఉండాలో , ఎలా ప్రవర్తించాలో రామాయణము ద్వారా మనకు చెబుతారు కాబట్టి నా అబిప్రయములో అవి కేవలము శాపాలు కాదు , శాపా అనుగ్రహము .
మనలాంటి మాములు మనుషులు కోపానికి లొంగుతారు , అందుకనే ఎవరితో గొడవ పడితే ఇంక మనం వాడి మొఖమ్ కూడా చుడం , కానీ అరిశాద్వార్గాలకు లోను కానీ ఋషులు కోపం వచ్చి శాపం పెట్టిన , వెంటనే  శాప విమోచనం కూడా చెబుతారు . కోపానికి లోను కారు , కోపం వచినట్టు నటిస్తారు . అలా నటించారు కాబట్టే భాగవతం , మహా భారతము, రామాయణం లాంటి ఇతిహాసము (ఇది ఇలాగే జరిగింది ) వచ్చినవి.

భాగవతం , మహా భారతము, రామాయణం మన నిత్య జేవితంలో ఉపయోగపదట్లేదంటారా ????
మతము అంటే పెద్దలు ఏమి చేబుతారంటే మనిషి మతి నుండి పుట్టినది అని ,  ఫలానా వ్యక్తి , ఫలానా సంవత్సరంలో పుడితే ఫలానా మతము పుట్టినది చెపుకోవటానికి మనది మతము కాదు మరి ఏమిటి ???? హిందూ మతం అంటారు కొంత మంది  కాదు , ధర్మము  సనాతన ధర్మము  . ఏ  మనిషి మతి నుండి పుట్టలేదు.


అందుకే సనాతన ధర్మం లోవర్ణాశ్రమ వ్యవస్థ (నాలుగు వర్ణములు ), ఆశ్రమ ధర్మాలు  గురించి నొక్కి చెప్పారు , అర్ధం చేసుకుంటే మన జీవితానికి సోపానాలు అవుతాయి , వర్ణాశ్రమ వ్యవస్థ అర్ధం కాకపోతే  కుల పిచ్చి అని , ఇంకొకటి అని ఎదో ఒకటి విమర్శిస్తుంటారు .

భారత దేశాన్ని ఇంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల పాటు అన్య మతస్తులు పరిపాలించారు, మత మార్పిడులు చేశారు,  ఎన్నో అవమానాలకి, అవహేలనలకి , తిరస్కరాలకి , ఆటు పొట్ల కి గురి అవతు  ఉన్న నిలబడుతుంది , గెలుస్తుంది సనాతన ధర్మము , సనాతన ధర్మమే లేని యెడల  ప్రపంచమే ఉండదు అని నా వ్యక్తిగత అబిప్రాయము .

జై శ్రీ రామ్ అంటే  ఏమిటి ?????????

జై  (జిందాబాద్ )
శ్రీ  (శ్రీ మాత్రే నమః )
రా (నమో నారాయణాయ)
మ (నమః శివాయ )

భగవంతుడు ఒక్కడే 



Tuesday, 19 May 2015

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం. 2


పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.
పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –
’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా దింభకున్’
అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో 
’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’
ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు. కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.
పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! మహానుభావుడు అంత నిరాడంబరుడు

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం.1



శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాదు – ’ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినివాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.
ఏడురోజులు భాగావతమును వినిని పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – ’శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. ’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు –
’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి.కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నారు నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూదా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?
వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.
ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.
వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.
పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే 
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?

ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!

Monday, 11 May 2015

కస్తూరి రంగా రంగా

కస్తూరి రంగా రంగా-నాయన్న-కావేటి రంగరంగా
శ్రీ రంగా రంగరంగా-నిను బాసీ-ఎట్లునే మరచుండూరా//కస్తూరి//

కంసున్ణీ సంహరింపా-సద్గురుడు-అవతారమెత్తినపుడు
దేవకీ గర్భమునాను-కృష్ణావా-తారమై జన్మించెను//కస్తూరి//

ఏడు రాత్రులు చెరిచి-ఒక రాత్రి-ఎకరాత్రిగా జేసేను
ఆదివారము పూతను-అష్టమీ-దినమందు జన్మించెను//కస్తూరి//

తలతోనూ జన్మమైతే-తనకుబాము-మోసంబు వక్చుననుచు
ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు-దాడులను జాంపెనపుడు//కస్తూరి//

నెత్తూరతోవుంది యపుడు- బాల-క్యావు క్యావున ఏడ్చుచు
నన్నెల ఎత్తుకొనవే- తల్లి-దేవకీ వందనంబు//కస్తూరి//

ఒల్లెల హీనంబుతో - రీతి-నిన్నాను కన్నా తండ్రి
నిన్నెట్లు ఎత్తుకొండు-నీ వొక్క-నిమిషంబు తాళరణ్నా//కస్తూరి//

గంగాను ప్రార్ధించెను-జళనిధుల-గంగా తానుప్పొంగేనూ
గంగా నదిలో నప్పుడు-దేవకీ-జలాకంబులాడేనపుడు//కస్తూరి//

ఇకనైనా ఎత్తుకొనవే-నా తల్లి-దేవకీ వందనంబు
కానీ బాలుని రీతిగా-నన్నీట్లు ఎడబాసీ యుందతగునా//కస్తూరి//

నీ పుణ్యమాయె కొడకా-ఇంకొక్క-నిమిషంబు తాళమనుచు
కామధేనువు నప్పుడు-దేవకీ-అడగి ప్రార్ధించగానూ//కస్తూరి//

పాల వర్షము గురిసెను-అప్పుడా-బాలుపై చల్లగానూ
తడి వస్త్రములు వాడచేను-దేవకీ-పొడి వస్త్రమును కట్టెను//కస్తూరి//

పొత్తిళ్లా మీద నపుడు-బాలుందు-చక్కగా పవళించెను
తన రెండు హస్తములతో-దేవకీ-తనయుణ్ణి ఎత్తుకొనేనూ//కస్తూరి//




ఆద్దాలప వేసుక - బాలు-నంద చందము చూచేను
వాసుదేవు పుత్ృుదమ్మా- బిడ్డ-వైకుంట వాసుదమ్మా//కస్తూరి//

నవనీత చోరుడామ్మా- బిడ్డ-నందగొపాలుదామ్మా
సీత పాత్ర నేత్రుదమ్మా- బిడ్డ-శ్రీ రామ చంద్ృుదమ్మా//కస్తూరి//

శిరమున చింతామణి-నా తండ్రి-నాలుకాను నాల్షత్రము
పండ్లను పరుశావేడి-భుజమున-సంఖు చక్రములు గలవు//కస్తూరి//

వీపున వింజామరా-నా తండ్రి-బొద్డున పారిజాతము
అరీకాల్ల పద్మాములను-అన్నీయు-అమరేను కన్నా తండ్రీ//కస్తూరి//

నీ రూపు చక్కడనము- బ్రహ్మ-యెన్నాళ్ళు వ్రాసే తండ్రీ
అన్నెకారి కడుపునా- అయ్యా-ఎలా జన్మిస్తివయ్య//కస్తూరి//

మయ యన్న కంసరాజు-ఇప్పుడు-వక్చు వెలాయారణ్నా
నిన్ను నేనెత్తుకొని- త్రోవా-నెగూడుర కన్నా తండ్రీ//కస్తూరి//

చక్కడనము జూచి-దేవకి-సోకింప సాగేనపుడు
తల్లి శోకాము మాంపగా-మాధవుడు-తంత్రమోక్కటి జేసేను//కస్తూరి//

పెద్ద బొబ్బాలు పెట్టుచు-మాధవుడు-గట్టిగా ఎడ్వా సాగే
శోకంబు చాలించియు-దేవకి-బాలుణ్ణి ఎత్తుకొనేనూ//కస్తూరి//

నా యన్న ఉరుకోరా-నా తండ్రి-గోపాల పవళించారా
ఆళ్లదుగో బూచివాడు-నా తండ్రి-వస్తాడు పవళించారా//కస్తూరి//

బుచులను మర్దించాను-నలినాక్షి-బుద్ధిమంతుడను అమ్మా
బుచేమీ చేసునంమా-నా తల్లి-బూచి నన్నేరుగునంమా//కస్తూరి//

నీ పుణ్యమాయేకోడాకా-నీ వొక్క-నిమిషంబు తాలూమనుచ్
ఆళ్లదుగో జోగీవాడు-నా తండ్రి-వస్తాడు -పవళించారా//కస్తూరి//

జోగి మందుల సంచులు- వేల-నా చంకా నుందగానూ
జోగేమి చేసునంమా-నా తల్లి-జోగి నన్నేరుగునంమా//కస్తూరి//

నీ పుణ్య మాయె కొడకా-నీ వొక్క-నిమిషంబు తాలూమనుచు
ఆళ్లదుగో పాము వక్చే-నా తండ్రి-గోపాల పవళించారా//కస్తూరి//

పాముల్లా రాజె అయినా-శేశుండు-పణుపై ఉండగానూ
పామేమీ చేసునంమా-నలినాక్షి-భయము నీకేలా నమ్మా//కస్తూరి//

నీలమేఘపు ఛాయలు-నీమేను-నీలాల హారములును
సద్గురుందు వ్రాసినాడు-నా తండ్రి-నీరుపు నీ చక్కన//కస్తూరి//

నిన్ను నేనెత్తుకొని- త్రోవా-పొడురా కన్నా తండ్రి
నాకేమీ భయము లేదే-నా తల్లి-నాకేమీ కొడువ లేదే//కస్తూరి//

తెమ్మని సుతునాడిగేను-దేవకి-అన్నాడీ అన్నతోనూ
మగవాడూ కాదూరాణ్నా-ఈ పిలా-ఆడపిల్ల నమ్మారా//కస్తూరి//

ఉపవాసాములు నోములూ-నోచి ఈ-పుత్రికను గణీటినన్నా
పుత్రి దానము చేయరా-నాయనా-పుణ్యవంతుదావురాణా//కస్తూరి//

దేవాది దేవులైన-బ్రహ్మ-రుద్రాదులకు పూజా చేసి
పూజా ఫలముల చేతను-వారికృుప-వల్ల పుత్రికని గంటి//కస్తూరి//

నీ పుణ్యమాయెరణ్నా-నీవు-పుత్రికను దయ చేయమన్నా
నిర్దయాత్మాకుడవగుచు-నీ వీట్లు-చేయూత తగదూరాణ్నా//కస్తూరి//

ప్రేమతో చెల్ళెలపుడు -అన్నాను-చేయి పట్టి బ్రతిమాలేను
గంగాది నదులయందు-పుత్రాదానము చేయమని అడిగేను//కస్తూరి//

కాదు కాదని కంసుడు-దేవకి-పుత్రికను అడిగెనపుడు
అద్దాలపై బాలను-పుక్చుకొని-ఎగరేసి నరకబోయే//కస్తూరి//

అంబరమునకు ఎగూరగా-వేయనాపూడా బాల కంసు జూచి
నన్నెల ఛంపెడావూరా-నీ యబ్బా-రేపల్లె వాడాలోనూ//కస్తూరి//

పెరుగుతున్నాడు వినారా-కృష్ణావతారమై జన్మించెను
నిజముగా దోచేనపుడు-కంసుండు-ఏతేంచి పవళించెను//కస్తూరి//

రేపల్లె వాడాలోనూ -పెరుగు చున్నదని దిగులోండెను
నీ యబ్బా నీ తాతరా-కంసుడా-కృష్నుండు పుట్టేణనుచు//కస్తూరి//

చల్లమ్ము వారాలెల్ల-ఆ కబురు-చక్కగా చెప్పగానూ
పూతానకు కబురాయఎను-అప్పుడా-పూతన చానుడెంచెను//కస్తూరి//

శృంగారముగా పూతన-స్థానములకు-విషాధార పూసుకొనేనూ
రేపల్లె వాడాలందు-కృష్ణుడు-తిరుగుచున్న చోటకు//కస్తూరి//

చానుడెంచి విషాపు పాలు-ఇవ్వను-సమకట్టి ఇవ్వగానూ
బాలూరతో-బంతులాద-పరుగెత్తి-వీధి నడుమను నిలిచేను//కస్తూరి//

ప్రేఅమతోకృష్ణున్ని చూచి-పూతన-భూమిపై కొరిగిపడగా
గోపెమ్మ చూచి అపుడా-బంగారు-గిన్నెలో బువ్వాపెట్టి//కస్తూరి//

ప్రోద్డున్న ఉగ్గుపోసి-కృష్ణున్ని-ఎడలోనూ పాండవేసే
అంతలో కంసాహిథుడు-బందీరు-పై ఎదురుగా వక్ఛేను//కస్తూరి//

పాదములు రెండు పిడుగు-లావలే-దడదడా విసిరేనపుడు
వృషభమై వక్చు నిలువ-ఒక్క లఘువున-ఛంపీవేసెనపుడు//కస్తూరి//

చల్లమ్ము వారాలెల్ల-ఈ కబురు-చల్లగా చెప్పీరపుడు
రేపల్లె వాడాలోనూ-ఉన్నాత్తి-గోపికలు గుంపు గుడి//కస్తూరి//

మాఇళ్లకోక్చుణంమా-కృష్ణుడు-మమురవ్వ చేసునంమా
తాలలేమామ్మ మేము-మీ సుథుడ్-తాలిమితో ఉండాదమ్మా//కస్తూరి//

మాగనివాలే పనులు సేయ-నీ సుతులు-మయ ఇండ్లలోకి వక్చు
ఇకనైన్ అబుద్ధి చెప్పి-ఇంతీరో-పదిలమ్ము సెయుమంమా//కస్తూరి//

అనుచుచు గట్టీగాను-మనంంత-గోపెమ్మ కడకు బోయి
చెప్పుదామనుచు వారు-గోప్ర్మ్-చెంతకేగేనపుడు//కస్తూరి//

గోపాలకృష్ణుడపుడు-ఆచటనే-పాలు త్రాగుచు నుందెను
ఇడీయేమీ యాశ్చర్యమే- ఓచేలియా-ఇడీయేమీ చోద్యమమ్మ//కస్తూరి//

కనుపాపలను దీనునే-కృష్ణుడు-దోంగతనములు చేసునే
ఇకానేమీ చేసునో-మనమూబులు-పాటవమున వస్తివ్మ్మా//కస్తూరి//

అమ్మనే నేరుగనమ్మా-నా త్రోవా-నెబోవుచుండగానూ
నను రవ్వ చేసిరమ్మా-నేనంత-భయపడి వస్తినమ్మా//కస్తూరి//

కొబ్బరికుదకాలనుచు-గోపికలు-గొబ్బుణ పిలువబోవ
కొబ్బరి కూడకాలనుచు-గోపికలు-గుబ్బాలను చూపినారు//కస్తూరి//

పోవ్ర్నమి రోజులందు-జలజాక్షు-లాందరు కూడుకొని
చీరళటు తీసివేసి-గోపికలు-జలకమాడుచు నుందగా//కస్తూరి//

తీశీవుంచిన చీరలు-కృష్నుండు-వేసే పొన్న మీద
వేశియు వేణు నాదం-ఉడుచు-ఉండే నా మాధవుడు//కస్తూరి//

జలకమ్ము చాలించియు-గోపికలు-మనాచీర లేమాయనే
నమ్మారాడమ్మ కృష్ణుని-ఇకను -చిన్న గొల్లవాని నేపుడు//కస్తూరి//

ఎంత పని జేస్ేనమ్మా- చెలియ-ఏమీ యాశ్చర్యమమ్మా
వెదుకుచూ కొందరూండీ-నీళ్ళలో-మునిగియుందీరి కొందరు//కస్తూరి//

అప్పుడు గోపికలలో-ఒక ఇంతి తాజుచి శ్రీ కృష్ణునీ
రారే అమ్మాలారా- పొన్న మీదనున్నకృష్ణుని//కస్తూరి//

ఇవ్వరా మయ చీరలు- కృష్ణ-ఇవ్వరా మయ రవికెలు
దండంబు పెట్టేదారా-కృష్ణయ్య-దయయుంచి దయచెయ్యరా//కస్తూరి//

అందరు ఒక చేతితో-దండంబు పెట్టగా చూచి తాను
పొందుగా మీరందరూ-దండంబు రెండు చేతులాబెట్టరే//కస్తూరి//

ఎంత పని వక్చెననుచు-గోపికలు-మానభంగము నోందిరి
వాసుదేవ తనయునాకును-దండంబు రెండు చేతుల బెట్తీరీ//కస్తూరి//

పొందుగా వాలువలన్నీ-కృష్నుండు-పేరు పేరున ఇక్చేను
నాయత్తా తిత్తూనేమో-యనుచునోక-రోకరితోవగాచీరపుడు//కస్తూరి//

మాయాడు బిడ్డ ఇప్పుడు-కొట్టునో-నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక-నివ్వడు-నేనేమి చేతునంమా//కస్తూరి//

కస్తూరి రంగా రంగా-నాయన్న-కావేటి రంగరంగా
నిను బాసీ ఎటునే మరచుండూరా//కస్తూరి//