Friday, 6 May 2011
Tuesday, 3 May 2011
Saturday, 30 April 2011
Friday, 29 April 2011
Wednesday, 27 April 2011
Thursday, 21 April 2011
Wednesday, 20 April 2011
రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.
ఉనికి భౌగోళిక స్వరూపము-
రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తు లొ ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. 9.28° N 79.3° E.[1]. ఈ శంఖు ఆకారములొ ఉన్నఈ ద్వీపము విస్తీర్ణం 61.8చదరపు కి.మి. ఈ ద్వీపము యొక్క భూభాగాని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక.ఇక్కడ నుండి శ్రీలంక దేశము కనిపిస్తూ ఉంటుంది.శ్రీలంక ప్రధాన పట్టణంకొలంబొ112 కి.మి దురములొ ఉన్నది.
2001 సంవత్సరము జనాభా లెక్కల ప్రకరం రామేశ్వరము జనాభా 38,035, అందు 52% పురుషులు, 48 % స్త్రీలు. రామేశ్వరము అక్షరాస్యత శాతము 72% (జాతీయ సగటు అక్షరాస్యత శాతం 59.5%)అందు పురుషుల అక్షరాస్యత 77% , స్త్రీల అక్షరాస్యత 66%. రామేశ్వరములొ ఆరు సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న జనాభా శాతం 13%.
రామనాథేశ్వర దేవాలయం
దక్షిణభారత దేశములొ ఉన్న దేవాలయాల వలే రామేశ్వరములొ ఉన్న రామనాథేశెవరస్వామి దేవాలయ ప్రాకరము నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉన్నది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దురము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దురము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. మూడవ ప్రాకారం
| బయటి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 690 అడుగులు |
| ఉత్తరం-దక్షిణం | 435 అడుగులు | |
| లోపలి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 649 అడుగులు |
| ఉత్తరం-దక్షిణం | 395 అడుగులు | |
| ఆలయం మొత్తం స్థంభాల సంఖ్య | 1212 | |
| ఆలయం లోపలి భాగం ఎత్తు | 22 అడుగులు 7.5 అంగుళాలు |
రామేశ్వరములొ విశేషాలు
రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడు లో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.రామనాథస్వామి గుడి , కొటి తీర్థాలు, రామపాదాలు,ధనుష్కోడి , విభిషనాలయం, ఇంకా చాలా చాలా వున్నాయి.
చేరుకొనే విధానం
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది .
from wikipedia
ధనుష్కోడి
ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రములోని తూర్పుతీరమున ఉన్న రామేశ్వరము దీవి యొక్క దక్షిణపు అంచునగల చిన్న గ్రామం. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి, ప్రస్తుతం ఒక చిన్న జాలార్ల గ్రామము.
ధనుష్కోడి, పాంబన్ వంతెనకు ఆగ్నేయముగా ఉన్నది. రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయినది. ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.
పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము) మరియు రత్నాకర (హిందూ మహాసముద్రము)ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చినది.
Subscribe to:
Posts (Atom)













