ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రములోని తూర్పుతీరమున ఉన్న రామేశ్వరము దీవి యొక్క దక్షిణపు అంచునగల చిన్న గ్రామం. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి, ప్రస్తుతం ఒక చిన్న జాలార్ల గ్రామము.
ధనుష్కోడి, పాంబన్ వంతెనకు ఆగ్నేయముగా ఉన్నది. రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయినది. ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.
పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము) మరియు రత్నాకర (హిందూ మహాసముద్రము)ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చినది.
No comments:
Post a Comment